Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎబోలాపై ఆందోళన వద్దు: మంత్రి దామోదర

Follow Udayam on Google
Vani Tripathi Tikoo May 27, 2026 1:14 PM హైదరాబాద్General
ఎబోలాపై ఆందోళన వద్దు: మంత్రి దామోదర - Udayam
రాష్ట్రంలో ఎబోలా వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. వ్యాధి ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు రాష్ట్రంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు. ముందుజాగ్రత్తగా గాంధీ ఆస్పత్రిలో 10 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశామన్నారు. ఎబోలా దేశాల నుంచి వచ్చిన 58 మందిని 21 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నామని, అనుమానితుల శాంపిళ్లను పుణె ల్యాబ్‌కు పంపుతామని మంత్రి వివరించారు.

Comments

G
Loading comments...