వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లాలోని పలు ఆలయ కోనేర్లు నిర్వహణ లేక అపరిశుభ్రంగా మారాయి. నాగర్‌కర్నూల్, తిమ్మాజిపేట, తెలకపల్లిలో కొన్ని కోనేర్లు కనుమరుగవగా, అచ్చంపేట, వెల్దండలోని కోనేర్లు అధ్వానంగా ఉన్నాయి.
వెల్దండ మండలం గుండాల శ్రీ అంబా రామలింగేశ్వరస్వామి ఆలయ కోనేరులో బతుకమ్మలను తొలగించకపోవడంతో దుర్వాసన వస్తోంది. కార్తీకమాసంలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కోనేర్లను శుభ్రపరచాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

