వార్తలకు తిరిగి వెళ్లండి
సికింద్రాబాద్‌లో గణేష్ విగ్రహాలు భారీగా నిమజ్జనానికి తరలివచ్చాయి. ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి జలవిహార్ వరకు సుమారు 2 కి.మీ మేర వాహనాలు బారులు తీరాయి. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద క్రేన్లతో నిమజ్జనం కొనసాగుతోంది.
రద్దీ కారణంగా మండపాల నిర్వాహకులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అధికారులు అదనపు ఏర్పాట్లు చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
Comments
Loading comments...

