వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని 11 ప్రధాన నగరాల్లో 750 ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు రవాణా శాఖ పనులు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తొలి విడతగా 300 అధునాతన బస్సులు జులై ఆఖరు నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
కాలుష్యాన్ని తగ్గించేందుకు కాలం చెల్లిన డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా 2,500 విద్యుత్, 500 సీఎన్‌జీ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. భవిష్యత్తులో పల్లెవెలుగు నుండి ఎక్స్‌ప్రెస్ సర్వీసుల వరకు అన్నింటినీ విద్యుత్ బస్సులుగా మార్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
Comments
Loading comments...

