Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్‌దారులకు తీపి కబురు

Follow Udayam on Google
Ravi Shukla May 31, 2026 8:20 AM అమరావతిGeneral
పింఛన్‌దారులకు తీపి కబురు - Udayam
రాష్ట్ర ప్రభుత్వం పింఛన్‌దారులకు శుభవార్త చెప్పింది. జూన్ నుండి స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 5,606 మందికి వితంతు పింఛన్లు మంజూరు చేసింది. సోమవారం 62.34 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనుండగా, ఇందుకోసం ప్రభుత్వం రూ.2,728 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వ రెండేళ్ల కాలపరిమితి పూర్తవుతున్న సందర్భంగా, జూన్ 12న అర్హులైన మరికొన్ని లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసే అవకాశాలున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...