వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధ్యాత్మిక శోభ, భద్రత దృష్ట్యా ఇంద్రకీలాద్రి దుర్గ గుడిలోకి భక్తులు, సిబ్బంది సెల్‌ఫోన్లు తేవడంపై ఈవో శీనానాయక్ నిషేధం విధించారు. కొందరు మూలవిరాట్టు ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
టికెట్ కౌంటర్లు, క్యూలైన్లలో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, అత్యవసరాలకే మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

