వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 21న నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 అమలులో ఉంటుందని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. కేంద్రాల 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపుగా ఉండకూడదని స్పష్టం చేశారు.
పరీక్షా సమయాల్లో కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్, జిరాక్స్, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

