వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ ఫలితాల్లో అవకతవకలపై కరీంనగర్‌లో ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ చౌక్‌లో మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటోందని, పరీక్షను రద్దు చేసి విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

