Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంపు గ్రామంగా ప్రకటించాలని స్వామికి లేఖ

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 8:02 AM కరీంనగర్General
ముంపు గ్రామంగా ప్రకటించాలని స్వామికి లేఖ - Udayam
నారాయణపూర్‌ను ముంపు ప్రాంతంగా ప్రకటించేలా చూడాలని కోరుతూ ఓ భక్తుడు కొండగట్టు ఆంజనేయస్వామికి లేఖ రాసి హుండీలో వేశారు. ఎమ్మెల్యే సత్యం ఇచ్చిన హామీ నెరవేరేలా చూడాలని ప్రార్థించారు. గురువారం హుండీల లెక్కింపులో ఈ లేఖ బయటపడింది. ఆలయంలోని 14 హుండీలను తెరిచి కానుకలు లెక్కించగా, 76 రోజులకు రూ.1.23 కోట్ల నగదు, 68 విదేశీ నోట్లు వచ్చినట్లు ఈవో అంజనారెడ్డి వెల్లడించారు.

Comments

G
Loading comments...