వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని మియాపూర్ మయూరినగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈషా సాహూ(37) అనే మహిళ తన ఆరు నెలల పసికందుతో సహా అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన చిన్నారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
రెండో బిడ్డ పుట్టిన తర్వాత ఈషా తీవ్ర మానసిక ఒత్తిడికి (పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్) గురవడమే ఈ అఘాయిత్యానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

