వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయల మార్కెట్ మొబైల్ దొంగలకు అడ్డాగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో కొనుగోలుదారులు ఏమరుపాటుగా ఉన్న తరుణంలో దుండగులు ఫోన్లు అపహరిస్తున్నారు.
ఇక్కడ పోలీసుల పర్యవేక్షణ, గస్తీ కరువవడంతో చోరీలు పెరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక సిబ్బందితో నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

