వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ మైనింగ్ కుంభకోణం కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ లీజులు, అవకతవకలపై విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా శనివారం సీఐడీ కేసు నమోదు చేసింది. నిబంధనల ఉల్లంఘనలపై సిఐడి ఇకపై లోతైన దర్యాప్తు జరపనుంది.
అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులు, లీజుదారుల పాత్రపై విచారణ జరిపి కీలక రికార్డులను స్వాధీనం చేసుకోనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ, ఉత్కంఠ మొదలైంది.
Comments
Loading comments...

