వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు కారణమైన కేసులో పిటిషనర్ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. నాంపల్లి కోర్టు వద్దకు వచ్చిన ఒక ముఖ్యనేత పీఏ తనను కేసు వివరాలు అడిగారని, కుంభం శివకుమార్‌రెడ్డిని కాపాడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
తనకు జరిగిన అన్యాయంపై మీనాక్షీనటరాజన్ స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పీఏ పురుషోత్తం రెడ్డి తనను కలవనివ్వకుండా అడ్డుకున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించానని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

