Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం షాపుపై మహిళల దాడి

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 2:32 PM జాతీయంGeneral
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా గుర్సరాయ్‌ నారాయణ్‌పురాలో మద్యం దుకాణంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపులోకి చొరబడి మద్యం బాటిళ్లు, ఇతర వస్తువులను రోడ్డుపై పడేసి నిరసన తెలిపారు. మద్యం మత్తులో కొందరు ఇళ్లలో గొడవలు చేస్తూ గృహహింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నివాస ప్రాంతంలోని మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని అధికారులను డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...