Back to feed
పోలవరం ప్రాజెక్టుకు మహానది జలధార
Rohit Singh Jun 06, 2026 4:53 AM అమరావతి 8 viewsabout 4 hours ago

మహానది-గోదావరి నదుల అనుసంధాన మార్గంలో కీలక మార్పులు చేశారు. ఇకపై ఈ జలాలు ధవళేశ్వరం బదులు నేరుగా పోలవరానికి మళ్లించనున్నారు. జాతీయ జల అభివృద్ధి సంస్థ ఆమోదించిన ఈ నిర్ణయం ద్వారా ఏపీకి 147 టీఎంసీల అదనపు నీరు అందుబాటులోకి రానుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా మహేంద్రతనయ, వంశధార మీదుగా హిరమండలం, ఏలేరు రిజర్వాయర్లకు నీటిని తరలిస్తారు. తద్వారా ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరణ సులభతరమవుతుంది. ఈ ప్రణాళికతో ఏ రాష్ట్రానికీ నష్టం లేకుండా గరిష్ఠ ప్రయోజనాలు చేకూరనున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Loading comments...


