Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదరసా టీచర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

అశ్విని దేవి Jul 03, 2026 5:12 AM అల్ ఇండియా 6 viewsabout 1 hour ago
మదరసా టీచర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష - Udayam Digital
హైదరాబాద్‌ షాహీన్‌నగర్‌లోని మదరసాలో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2022లో నమోదైన ఈ పోక్సో కేసులో న్యాయస్థానం నేడు తుది తీర్పును వెలువరించింది. బాలుడు తీవ్ర మనస్తాపానికి గురై మదరసాకు వెళ్లడం మానేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తండ్రి ఫిర్యాదుతో బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేయగా, విచారణ అనంతరం నిందితుడిని దోషిగా తేలుస్తూ కోర్టు శిక్ష ఖరారు చేసింది.

Comments

G
Loading comments...