Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'లాజిస్టిక్స్ పాలసీ 2.0'తో భారీ అభివృద్ధి

Follow Udayam on Google
Sonal Jun 13, 2026 10:47 AM హైదరాబాద్General
'లాజిస్టిక్స్ పాలసీ 2.0'తో భారీ అభివృద్ధి - Udayam
రాష్ట్రంలో లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు 'లాజిస్టిక్స్ పాలసీ 2.0'ను అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మెగా మల్టీ మోడల్ పార్కులు, డ్రై పోర్టుల ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగుపరచి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. 'తెలంగాణ రైజింగ్-2047' లక్ష్యసాధనలో లాజిస్టిక్స్ రంగం కీలకమని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ, ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా అధిగమిస్తామని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...