Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా నిల్వలపై కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ

Follow Udayam on Google
Harika Jun 13, 2026 12:49 PM హైదరాబాద్General
యూరియా నిల్వలపై కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ - Udayam
తెలంగాణలో వానాకాలం సాగు పెరిగిన నేపథ్యంలో, జూన్ నెలకు 2 లక్షల టన్నులు, ఏప్రిల్ లోటును భర్తీ చేయడానికి అదనంగా 0.47 లక్షల టన్నుల యూరియాను కేటాయించాలని కేంద్ర మంత్రి జె.పి. నడ్డాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఎరువుల డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, సరఫరాలో జాప్యం జరగకుండా ఎరువుల దిగుమతిదారులను అప్రమత్తం చేయాలని ఆయన లేఖలో విన్నవించారు.

Comments

G
Loading comments...