Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్సిటీలో చిరుత కలకలం: బోనులో బంధించిన అటవీశాఖ

Follow Udayam on Google
Ravi Sharma May 25, 2026 12:48 PM తిరుపతిGeneral
వర్సిటీలో చిరుత కలకలం: బోనులో బంధించిన అటవీశాఖ - Udayam
తిరుపతి ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలో చిరుతపులి కలకలం సృష్టించింది. వర్సిటీ ఆవరణలోని గర్భకోశ వ్యాధుల విభాగంలోకి అకస్మాత్తుగా చొరబడటంతో అక్కడ ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని శ్రమించి చిరుతను బోనులో బంధించారు. దీంతో వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...