వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో నిందితులైన అలం ఖాన్, అతని కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భూవివాదాల కారణంగానే ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
రూ.15 లక్షల సుపారీ ఇచ్చి, ఈ ఘోరాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు కుట్ర పన్నారు. ఈ కేసులో ఇప్పటికే మరో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

