వార్తలకు తిరిగి వెళ్లండి
ఇంద్రకీలాద్రిపై రాష్ట్రంలోనే తొలిసారిగా లడ్డూ ప్రసాదం ఏటీఎం ప్రారంభమైంది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రారంభించారు.
యూపీఐ ద్వారా చెల్లింపులు చేసి క్షణాల్లో లడ్డూ ప్రసాదం పొందవచ్చు. నకిలీ పూజా టికెట్లను నమ్మి మోసపోవద్దని, దళారులపై ఉపేక్ష ఉండదని కమిషనర్ హెచ్చరించారు. నకిలీ టికెట్లపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

