వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలం జైతుగూడకు చెందిన ఆత్రం రాజేశ్ (50) శుక్రవారం కూలీ పనికి వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. పని స్థలంలో అస్వస్థతకు లోనైన ఆయన, ఇంటికి వచ్చాక వాంతులు, విరేచనాలతో బాధపడుతూ బాత్రూమ్‌లో స్పృహతప్పి పడిపోయాడు.
కుటుంబ సభ్యులు వెంటనే లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

