వార్తలకు తిరిగి వెళ్లండి
కుబీర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో శనివారం వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉండగా మధ్యాహ్నం 2గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది. చల్లని గాలులతో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పంటలు వేసి వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం ఎంతో ఊరటనిచ్చింది. పంటలకు నీరు అందడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

