Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటపాడు-వెంకటాపురం రహదారిపై గుంతలతో ఇబ్బందులు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 12:01 PM తూర్పుగోదావరి General
కోటపాడు-వెంకటాపురం రహదారిపై గుంతలతో ఇబ్బందులు - Udayam
రంగంపేట మండలం కోటపాడు నుంచి వెంకటాపురం వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగంపేట, అనపర్తి మండలాలను కలిపే ఈ ప్రధాన మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రివేళ గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...