వార్తలకు తిరిగి వెళ్లండి

సంతమాగులూరు మండలం కొప్పరంలో సోమవారం 25 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. అడ్డరోడ్డు క్యాంపు కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి టీడీపీ విజయానికి కృషి చేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వాసురెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి గురు యాదవ్, నాగిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

