వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లిలో కోతుల బెడదతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎట్టి కమలమ్మ అనే వృద్ధురాలిపై కోతులు దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. హాస్టల్ విద్యార్థులపైనా కోతులు దాడులకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు.
చిన్నారులు, మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారని తెలిపారు. కోతుల బెడదను నివారించేందుకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

