Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోస్గిలో విద్యార్థులకు పోలీస్‌ స్టేషన్‌పై అవగాహన

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 6:17 PM నారాయణపేటGeneral
కోస్గిలో విద్యార్థులకు పోలీస్‌ స్టేషన్‌పై అవగాహన - Udayam
పోలీస్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివని కోస్గి సీఐ సైదులు అన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కోస్గి పోలీస్‌ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్‌ హౌస్‌ నిర్వహించి, పోలీస్‌ విధులపై అవగాహన కల్పించారు. లాకప్‌, సీసీ కెమెరాలు, ఆయుధాలు, వాకీటాకీల వినియోగం, డయల్‌ 112 సేవల గురించి వివరించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీఐ సూచించారు.

Comments

G
Loading comments...