వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వానికి భూముల దోపిడీపై ఉన్న శ్రద్ధ, అన్నం పెట్టే రైతులపై లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. శంషాబాద్‌లో రేవంత్ రెడ్డి అనుచరులు వేల కోట్ల విలువైన సీలింగ్ భూములను దోచుకున్నా సీఎం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ధాన్యం కొనకపోవడంతో గత 45 రోజుల్లో పది మంది రైతులు చనిపోయినా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి డబ్బు సంచులపై ఉన్న శ్రద్ధ ధాన్యం సేకరణపై లేదన్నారు.
Comments
Loading comments...

