Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈడీ నోటీసులపై కేశినేని చిన్ని స్పష్టత

Follow Udayam on Google
Rajesh Joshi May 25, 2026 12:32 PM విజయవాడGeneral
ఈడీ నోటీసులపై కేశినేని చిన్ని స్పష్టత - Udayam
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తన భార్యకు ఈడీ నోటీసులు ఇచ్చిందన్న ప్రచారం అవాస్తవమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) స్పష్టం చేశారు. గతంలో తాము భాగస్వాములుగా ఉన్న 'ప్రైడ్ ఇన్ఫ్రా' అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి మాత్రమే నోటీసులు వచ్చాయని తెలిపారు. గతంలో జరిగిన రూ.35 లక్షల లావాదేవీలపై వివరణ కోరుతూ ఈడీ నోటీసు పంపిందని, దీనిపై ఈ నెల 27న పూర్తి వివరాలు అందిస్తామని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...