వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నుంచి కొత్తపల్లి వరకు చేపట్టిన నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం పరిశీలించారు. రూ.163 కోట్ల వ్యయంతో 17 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును ప్రభుత్వం నిర్మిస్తోంది.
మొదటి దశలో సుందరగిరి-హుస్నాబాద్ మధ్య రూ.77 కోట్లతో, రెండో దశలో సుందరగిరి-కొత్తపల్లి మధ్య రూ.86 కోట్లతో పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

