వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారం నేపథ్యంలో రాజకీయం మరోసారి హీటెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు పూర్తయిన సందర్భంలో అధిష్టానం పిలుపు మేరకు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అత్యవసరంగా ఢిల్లీకి పయనమయ్యారు. పార్టీలోని వివాదాలకు చెక్ పెట్టేందుకు అధినాయకత్వం ఈ భేటీ ఏర్పాటు చేసింది.
ఢిల్లీలో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో ఇరువురు నేతలు భేటీ కానున్నారు. ఈ చర్చల్లో సీఎం మార్పుతో పాటు మంత్రివర్గ విస్తరణ, రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

