Back to feed
కాకినాడ కింగ్స్ జెర్సీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంటా
Ravi Shukla Jun 08, 2026 12:25 PM విశాఖపట్నం 4 viewsabout 2 hours ago

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో పాల్గొననున్న కాకినాడ కింగ్స్ జట్టు కొత్త జెర్సీని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం ఆవిష్కరించారు. ఎంవీపీ కాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ కింగ్స్ జట్టు ఆటగాళ్లు అద్భుత ప్రతిభ కనబరిచి టైటిల్ సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ నెల 9న మధురవాడ స్టేడియంలో ప్రారంభం కానున్న ఏపీఎల్ టోర్నీలో మొత్తం 7 జట్లు పాల్గొంటున్నాయి. విశాఖ, కడప, మంగళగిరి వేదికలుగా జరగనున్న ఈ పోటీలు 30న ముగియనుండగా, జెర్సీ ఆవిష్కరణలో జట్టు యజమాని శరత్, సీఈఓ సుమేద్ పాల్గొన్నారు.
Comments
Loading comments...



