వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్రో శుక్రవారం రాత్రి 11.51 గంటలకు శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–18 రాకెట్‌ను ప్రయోగించనుంది. నావిక్–03 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనుంది. గురువారం రాత్రి 8.21 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది.
స్వదేశీ అణు గడియారాలతో రూపొందించిన ఈ ఉపగ్రహం భారత నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయనుంది. దేశ భూభాగంతో పాటు సరిహద్దుల నుంచి 1,500 కిలోమీటర్ల వరకు నావిగేషన్ సేవలను అందించనుంది.
Comments
Loading comments...

