Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకరమైన గుంతలతో జయశంకర్ మైదానం

Follow Udayam on Google
Harika Jun 13, 2026 2:47 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ప్రమాదకరమైన గుంతలతో జయశంకర్ మైదానం - Udayam
జయశంకర్ మైదానం–ఎర్రగడ్డ–గౌతంపూర్ మార్గంలోని మూలమలుపు వద్ద రహదారి మధ్యలో ఏర్పడిన భారీ గుంత వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. ఫిల్టర్ బెడ్ పైపుల పనుల కోసం తవ్విన గుంతలను సక్రమంగా పూడ్చకపోవడం, వర్షాలకు రోడ్డు దెబ్బతినడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో మలుపు వద్ద ఈ గుంతను గుర్తించలేక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత సింగరేణి, గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి, తక్షణమే రహదారి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...