వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీసీ మార్చి త్రైమాసికంలో రూ.5,469.74 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ విక్రయాల ఆదాయం రూ.23,625.69 కోట్లకు చేరింది. విలీనాల కారణంగా క్రితం ఏడాదితో ప్రస్తుత ఫలితాలను పోల్చలేమని సంస్థ తెలిపింది.
పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఐటీసీ నికర లాభం రూ.21,018.15 కోట్లుగా నమోదైంది. ఒక్కో షేరుకు రూ.8 (800%) చొప్పున తుది డివిడెండ్ ఇచ్చేందుకు బోర్డు సిఫారసు చేసింది. దీనితో కలిపి మొత్తం డివిడెండ్ రూ.14.50కు చేరింది.
Comments
Loading comments...

