Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీ షేర్ల పతనం: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
Ravi Shukla Jun 03, 2026 4:20 PM జాతీయంమార్కెట్లు
ఐటీ షేర్ల పతనం: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు - Udayam
అంతర్జాతీయ అనిశ్చితి, ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు దాదాపు 9 శాతం కుప్పకూలింది. దీంతో సెన్సెక్స్ 303 పాయింట్లు నష్టపోయి 74,346 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు కోల్పోయి 23,405 వద్ద ముగిశాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు కోవిడ్ తర్వాత ఇదే అత్యంత భారీ నష్టం. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు కూడా నష్టపోగా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 95.71 గా నమోదైంది.

Comments

G
Loading comments...