Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కటాక్షపూర్ చెరువులో నిమజ్జనం పరిశీలన

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 6:32 PM హన్మకొండ General
కటాక్షపూర్ చెరువులో నిమజ్జనం పరిశీలన - Udayam
ఆత్మకూరు మండలం కటాక్షపూర్ పెద్ద చెరువులో బుధవారం వినాయక నిమజ్జనం ప్రారంభమైంది. చెరువులో పూర్తిస్థాయిలో నీరు లేకపోవడంతో అధికారులు గుంతలు తీయించి నీటిని నిల్వ చేసి నిమజ్జనం చేస్తున్నారు. అదనపు కలెక్టర్ శేషాద్రి నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. రాత్రి వేళ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి గణపతిని నిమజ్జనం చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

Comments

G
Loading comments...