వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తాగునీరు వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అనవసరంగా బయట తిరగవద్దని కోరారు.
దాహంతో ఉన్న వారికి నీరు అందించాలని, ఇళ్ల ముందు మట్టికుండల్లో తాగునీరు ఏర్పాటు చేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. వేసవి తీవ్రత పెరుగుతున్నందున చిన్నారులు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

