వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించే ‘ఇందిరమ్మ బీమా’ పథకం కోసం సమగ్ర ఇంటింటి సర్వే చేపట్టాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో అర్హులైన వారందరికీ బీమా వర్తింపజేయాలని అధికారులను ఆదేశించారు.
సర్వే పూర్తయిన ఇళ్లకు ప్రత్యేక లోగో స్టిక్కర్లను అతికిస్తారు. అలాగే, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుండి 12 వరకు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు.
Comments
Loading comments...

