Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ తీవ్ర హెచ్చరిక

Follow Udayam on Google
Ravi Shukla May 27, 2026 2:39 PM జాతీయంGeneral
భారత్ తీవ్ర హెచ్చరిక - Udayam
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, సార్వభౌమత్వ సూత్రాలను పాక్ ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఉగ్రదాడుల నుండి తమను తాము రక్షించుకునే పూర్తి హక్కు భారత్‌కు ఉందని, పాక్ చర్యలకు తగిన పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించింది. యూఎన్‌ఎస్‌సీ చర్చలో భారత ప్రతినిధి హరీశ్ పర్వతనేని మాట్లాడుతూ.. పాక్ ఆరోపణలను తిప్పికొట్టారు. ఉగ్రవాదానికి మద్దతును శాశ్వతంగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాతే భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిందని ఆయన గుర్తుచేశారు.

Comments

G
Loading comments...