వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరువుల ధరలు బస్తాకు రూ. 300 నుంచి రూ. 350 వరకు పెరగడంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. వానకాలం సాగుకు సిద్ధమవుతున్న వేళ, ఇప్పటికే నష్టాల్లో ఉన్న అన్నదాతలకు ఈ ధరల పెంపు మరింత గుదిబండగా మారింది. కొందరు డీలర్లు ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తూ, బలవంతపు అమ్మకాలతో దోచుకుంటున్నారు.
పెట్టుబడి ఖర్చులు లక్షలకు చేరుతుండటంతో రైతులు ప్రైవేటు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక, సాగు భారంగా మారుతోంది. ప్రభుత్వం స్పందించి ఎరువుల ధరలను నియంత్రించాలని, రైతులకు సకాలంలో సబ్సిడీలు, రుణాలు అందించాలని రైతాంగం కోరుతోంది.
Comments
Loading comments...

