వార్తలకు తిరిగి వెళ్లండి

తలుపుల మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గుత్తేదారులు మట్టి కోసం కొండలను విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. కదిరి-పులివెందుల రోడ్డు విస్తరణ, పొలాల చదును పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు. దీంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
అధికారులు మాత్రం స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అనుమతులు లేకుండా కొండలను కరిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను నిలిపివేయకపోతే అడవులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
Comments
Loading comments...

