వార్తలకు తిరిగి వెళ్లండి

హుకుంపేట మండలం రాళ్లగడ్డ జంక్షన్ వద్ద పోలీసులు గురువారం అక్రమంగా తరలిస్తున్న 650 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ అక్రమ రవాణా బయటపడింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎమ్మారైతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

