వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టులు, పెట్టుబడుల పేరుతో ప్రజల నుంచి లక్షలు దోచుకుంటున్నారు. దీనిపై ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు బ్యాంకు అధికారులతో సమావేశమై, అనుమానాస్పద లావాదేవీలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. నేరగాళ్ల ఖాతాలను వెంటనే స్తంభింపజేయడం ద్వారా బాధితుల సొమ్మును రక్షించవచ్చని స్పష్టం చేశారు.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు. మోసం జరిగిన గంటలోపు స్పందిస్తేనే డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఫోన్ కాల్స్ ద్వారా డబ్బులు అడగవని, డిజిటల్ అరెస్టుల భయానికి లొంగవద్దని పోలీసులు హెచ్చరించారు.
Comments
Loading comments...

