Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నటిగా ఫెయిలైతే కూరగాయలు అమ్ముకుంటా: యశశ్రీ

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jun 28, 2026 8:22 PM జాతీయంవినోదం
నటిగా ఫెయిలైతే కూరగాయలు అమ్ముకుంటా: యశశ్రీ - Udayam
విరాజ్‌ అశ్విన్, యశశ్రీ కీలక పాత్రల్లో వినోద్‌ గాలి తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ ‘గుర్తుకొస్తున్నాయి’. ఈ సిరీస్‌ జులై 3 నుంచి ‘ఈటీవీ విన్‌’ (ETV Win) ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్‌ ఆవిష్కరణ వేడుకలో నటి యశశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సిరీస్‌లో కుక్కర్‌లో ఉడకబెట్టడం, కొండపై నుంచి తోసేయడం వంటి భయానక సీన్లు ఏమీ లేవని ఆమె సరదాగా పేర్కొన్నారు. అంతేకాకుండా, నటిగా తాను ఒకవేళ ఫెయిలైతే కూరగాయలు అమ్ముకుంటానని చెబుతూ.. స్టేజ్ పైనే కూరగాయలు ఎలా అమ్ముతారో చేసి చూపించి అందరినీ నవ్వించారు.

Comments

G
Loading comments...