వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నగరం దేశంలోనే అత్యంత వేగంగా డేటా సెంటర్ల హబ్‌గా ఎదుగుతోంది. నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం, ఇక్కడి డేటా సెంటర్ల సామర్థ్యం 151 మెగావాట్లకు చేరింది. సురక్షిత భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల ముంబయి తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం మరో 1.9 గిగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు ఇక్కడ వివిధ దశల్లో ఉన్నాయి. తక్కువ వ్యయం, అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉండటంతో ఎన్‌టీటీ, అదానీకనెక్స్ వంటి దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తున్నాయి.
Comments
Loading comments...

