వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారిని బుధవారం 89,403 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ. 4.99 కోట్లుగా నమోదైంది. ఒక్క రోజే రికార్డు స్థాయిలో 4.22 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. 49,958 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
ప్రస్తుతం క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో 31 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

