వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లాలో ముస్లిం మైనారిటీల పవిత్ర బక్రీద్ పండుగ గురువారం ఘనంగా జరిగింది. సోమందేపల్లిలో ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ముస్లిం సోదరుల ర్యాలీని డ్రోన్ కెమెరాల సహాయంతో అధికారులు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించారు.
పెనుగొండ, హిందూపురం ప్రాంతాల్లో కూడా పండుగ సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవడానికి అధికారులు సహకరించారు.
Comments
Loading comments...

