వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం సేవలందించి మోదీ చరిత్రాత్మక మైలురాయిని అధిగమించారని భాజపా నేత రామచందర్‌రావు కొనియాడారు. 4,399 రోజుల మోదీ పాలన భారత చరిత్రలో స్వర్ణయుగమని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజల విశ్వాసానికి, ఆకాంక్షలకు మోదీ నిదర్శనమని ఆయన ప్రశంసించారు.
గరీబ్ కల్యాణ్ నుండి ప్రపంచ వేదికపై దేశ కీర్తిని పెంచడం వరకు ప్రతి రంగంలోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, మౌలిక వసతులు, ఆర్థిక ఆధునికీకరణ వంటి సంస్కరణలతో జాతీయ పునరుజ్జీవనానికి మోదీ కొత్త యుగాన్ని ప్రారంభించారని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Comments
Loading comments...

