వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాన రుణగ్రహీత కంటే ముందే ష్యూరిటీ (జామీను) ఇచ్చిన వ్యక్తి నుండి బకాయిలను నేరుగా వసూలు చేసే హక్కు చిట్ ఫండ్ కంపెనీలకు ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. చిట్ ఫండ్ చట్టం ప్రకారం రుణగ్రహీత, గ్యారెంటర్ ఇద్దరికీ సమాన బాధ్యత ఉంటుందని స్పష్టం చేసింది.
గుంటూరు కోర్టు జారీ చేసిన జీతం అటాచ్‌మెంట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. అలాగే, రిజిస్ట్రార్ పరిధిలోకి డిప్యూటీ రిజిస్ట్రార్ కూడా వస్తారని, వారు జారీ చేసే రికవరీ సర్టిఫికెట్లు చట్టబద్ధంగా చెల్లుతాయని హైకోర్టు స్పష్టం చేసింది.
Comments
Loading comments...

